Friday, February 20, 2026
Google search engine
Homeతెలంగాణజలమండలి కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా..

జలమండలి కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా..

ధర్నాలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ కార్పొరేటర్లు..

విశ్వనగరంలో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జలమండలి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, ఈ ధర్నా కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు..

ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధమని తెలిపారు.
సంవత్సరంనర కాలంగా కార్పొరేటర్లు ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిన 5 పైసలు కూడా మంజూరు చైయలేదని..మంచినీటి సరఫరా కోసం కొత్త విస్తరణ పనులు లేవని అన్నారు.. అదే విధంగా కొత్త డ్రైనేజీ కూడా లేదని.. మీరే పైపులు తెచ్చుకోండి అని అధికారులు చెప్తున్నారని. ఒక వైపు విశ్వనగరం అంటారు.. ఆ స్థాయిలో పన్నులు వసూలు చేస్తున్నారు.. కానీ సదుపాయాలు మాత్రం కల్పించడం లేదు. మురుగు నీరు ట్రీట్మెంట్ చేసిన పాపానపోలేదు. మురుగునీరు రోడ్డు మీద పారుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించారు.. వెంటనే మురికి కాలువలు, పైపులోని పూడికలు క్లియర్ చెయ్యాలి.. లోతట్టుప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవాలి. నీళ్లు నిలవకుండా ఏర్పాట్లు చేయాలనీ ఎండీకి సూచించానని తెలిపారు..

మిషన్ భగీరథ కోసం 50 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసిన తరువాత కూడా నగరవాసులు మంచినీళ్ళకోసం ఇబ్బందిపడుతున్నారు.
4, 5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. కొత్త కాలనీలు, అపార్ట్మెంట్ లకు కనెక్షన్ ఇవ్వడం లేదు. డబుల్ బెడ్ రూంలకు అయితే అతిగతీ లేదు. ట్యాంకర్ కొనుక్కుంటూ.. కూలి చేసుకుంటే వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు పరిష్కారం లేకపోయినా శివారు ప్రాంతానికి మంచినీటిని వెంటనే అందించాలని ఆయన కోరారు..

హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ.. హయత్ నగర్ డివిజన్ నగర శివారులో ఉండడం వల్ల మౌలిక వసతుల కొరత చాలా ఉందని, డివిజన్లోని చాలా కాలనీలో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్ సదుపాయం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున వీలైనంత త్వరగా వివిధ కాలనీలో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్ సదుపాయం ఏర్పాటు చేయాలని జలముండరి మేనేజింగ్ డైరెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు..

ఆ తర్వాత జలమండలి ఎండీతో సమావేశమైన ఎంపీ ఈటల రాజేందర్, కార్పొరేటర్లు. రెండు నెలల్లోగా శివారు ప్రాంతాల్లో మంచినీరు సరఫరా అందించక పోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అరుణ సురేందర్ యాదవ్, నాగోల్.. పవన్ కొత్తపేట, వంగ మధుసూదన్ రెడ్డి, చంపాపేట.. ప్రేమాశ్వర్ రెడ్డి, గడ్డి అన్నారం, ఆకుల శ్రీవాణి, సరూర్ నగర్, కొప్పుల నర్సింహా రెడ్డి, మన్సూరాబాద్.. లచ్చి రెడ్డి, బీ. ఎన్. రెడ్డి నగర్, నర్సింహా గుప్త చైతన్యపురి, శ్రవణ్, మల్కాజ్గిరి, శ్రీవాణి, రామంతాపూర్.. చేతన హరీష్, హబ్సిగూడ, తార చంద్రరెడ్డి, జీడిమెట్ల.. శేషగిరి గాజుల రామారం.. మహేందర్ మూసాపేట.. ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments