శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ థ్రెటెనింగ్ మెయిల్స్ రావడంతో నేడు ఉదయం కలకలం రేగింది. ఎయిర్ పోర్ట్‌లో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రాగా.. అధికారులు క్షుణ్ణంగా వెతికి బాంబు లేదని నిర్ధారించారు. అది ఫేక్ మెయిల్‌గా గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ మెయిల్స్ రావటం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది… విమానాశ్రయం మొత్తం బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ చర్యలతో ప్రయాణికులు కూడా తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. అయితే ఎయిర్‌పోర్టు మెుత్తం గంటల తరబడి గాలించినా.. బాంబు దొరక్కపోవడంతో చివరికి అది ఫేక్ అని అధికారులు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం పోలీసులు ఆ మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందో గుర్తించే పనిలో ఉన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు ఎయిర్‌పోర్టుకు ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో ఆ విమానాన్ని అధికారులు అత్యవసరంగా నిలిపేశారు. దాదాపు 6 గంటల పాటు విమానంతో పాటు ఎయిర్‌పోర్టు మెుత్తం క్షుణ్ణంగా చెక్ చేశారు. ఎక్కడా బాంబు దొరకలేదు. దీంతో ఎవరో కావాలనే బెదిరింపు మెయిల్ పంపినట్లు అధికారులు నిర్ధరణకు వచ్చారు. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసకున్న పోలీసులు.. ఆ మెయిల్ ఐడీ ఆధారంగా నిందితులను కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.