ఎల్బీనగర్:
ఆర్కేపురం డివిజన్ పరిధిలోని అల్కాపురి కాలనీలో ఆదివారం ‘నట్స్ స్పైస్.కామ్’ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ షాపును డివిజన్ నాయకురాలు పున్న నిర్మల గణేష్ నేత ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల రైతుల నుంచి నేరుగా సేకరించిన డ్రై ఫ్రూట్స్, తులసి తేనె, నట్స్, బెర్రీస్, మిల్లెట్ ఉత్పత్తులను ఈ స్టోర్లో అందుబాటులో ఉంచారు.
ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ.. సాంప్రదాయ రుచులతో కూడిన నాణ్యమైన ఉత్పత్తులను హోల్ సేల్, రిటైల్ ధరలకే స్థానిక ప్రజలకు అందించాలని నిర్వాహకులను కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, స్టోర్ యజమానులు విజయ్, శశికుమార్, స్రవంతి, సంతోషి మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.



