ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తన కెరీర్లో చివరిది అని ఖవాజా అధికారికంగా ప్రకటించారు.
శుక్రవారం ఉదయం తన భార్య, పిల్లలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన 39 ఏళ్ల ఖవాజా భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా జట్టులో తాను ఎదుర్కొన్న జాతి వివక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివక్షను ఇక భరించలేకపోతున్నానని, అదే తన రిటైర్మెంట్ నిర్ణయానికి కారణమని వెల్లడించారు.
అదే మైదానంలో ఆరంభం.. అదే జట్టుతో ముగింపు
ఉస్మాన్ ఖవాజా టెస్ట్ కెరీర్ 2011లో సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌పై ప్రారంభమైంది. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత అదే మైదానంలో, అదే జట్టుతో ఆడి ఆటకు స్వస్తి పలకడం అరుదైన మైలురాయిగా నిలిచిపోనుంది. ఇది ఖవాజా కెరీర్‌కు భావోద్వేగపూరిత ముగింపుగా మారింది.
జాతి వివక్షపై ఖవాజా ఆవేదన
రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఖవాజా మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
“జట్టులో ఇతర ఆటగాళ్లు గాయపడితే వారికి సానుభూతి దక్కేది. ‘అయ్యో పాపం జోష్’, ‘నాథన్ లయన్’ అంటూ మాట్లాడేవారు. కానీ నేను గాయపడితే మాత్రం నాదే తప్పన్నట్లుగా చూసేవారు. ఇతర క్రికెటర్లు మ్యాచ్ ముందు రోజు రాత్రి మద్యం తాగి గాయపడినా వారిని ఒక్క మాట అనేవారు కాదు. నా విషయంలో మాత్రం వేరుగా వ్యవహరించేవారు. ఇదే నాకు ఎక్కువగా బాధ కలిగించింది” అని ఖవాజా వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలు ఆస్ట్రేలియా క్రికెట్లో చర్చనీయాంశంగా మారాయి.
చరిత్ర సృష్టించిన తొలి ముస్లిం క్రికెటర్
పాకిస్థాన్‌లో జన్మించిన ఉస్మాన్ ఖవాజా, ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి ముస్లిం క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. తన ఆటతో పాటు తన వ్యక్తిత్వంతో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
గణాంకాల్లో ఖవాజా ప్రతిభ
టెస్టులు: 87
పరుగులు: 6,206
సగటు: 43.39
సెంచరీలు: 16
అర్ధ సెంచరీలు: 28
అన్ని ఫార్మాట్లు కలిపి అంతర్జాతీయంగా 8,000+ పరుగులు
కెరీర్లో అత్యున్నత ఘట్టం
2023లో ఖవాజా ఐసీసీ ‘మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకోవడం ఆయన కెరీర్లో అత్యున్నత ఘట్టంగా నిలిచింది.
ఆస్ట్రేలియా క్రికెట్లో ఖాళీ
ఆటలో స్థిరత్వం, ఓపెనర్‌గా అపార అనుభవంతో ఆస్ట్రేలియా జట్టుకు సేవలందించిన ఉస్మాన్ ఖవాజా రిటైర్మెంట్ నిర్ణయం అభిమానులను, క్రికెట్ వర్గాలను భావోద్వేగానికి గురి చేసింది. అయితే జాతి వివక్షపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆస్ట్రేలియా క్రికెట్లో అంతర్గత వ్యవస్థపై ప్రశ్నలు లేపుతున్నాయి


