ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ త్రిసరిహద్దుల్లో భద్రతా బలగాలు నిర్వహించిన భారీ ఆపరేషన్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిచెందినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. హిడ్మాతో పాటు అతని భార్య, ఇద్దరు బాడీగార్డులు సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో హతమైనట్లు సమాచారం.
ఆపరేషన్ ఎలా జరిగింది?
అడవి లోతుల్లో నిశితంగా సమాచారాన్ని సేకరించిన పోలీసులు, Greyhounds, CRPF జవాన్లు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఉదయం 4 గంటల సమయంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ప్రతిగా పోలీసులు ఫైర్ చేయడంతో ఘర్షణ గంట పాటు కొనసాగింది. చివరకు కాల్పులు ఆగిన తర్వాత ప్రాంతాన్ని శోధించిన అధికారులు హిడ్మా సహా మరికొంతమంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు.
ఎన్కౌంటర్ అనంతరం అధికారులు మాట్లాడుతూ, “ఆపరేషన్ విజయవంతమైంది. అడవుల్లో మావోయిస్టు కదలికలను పూర్తిగా నిర్మూలించేందుకు ఇదొక పెద్ద ముందడుగు” అని తెలిపారు. ఈ ఘటన తర్వాత పరిసర ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి కాంబింగ్ను మరింత వేగవంతం చేశారు.


