Monday, June 23, 2025
Google search engine
Homeసినిమాకన్నప్ప చిత్రబృందానికి బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య హెచ్చరిక..

కన్నప్ప చిత్రబృందానికి బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య హెచ్చరిక..

కన్నప్ప సినిమాలో పిలక, గిలక అనే రెండు పాత్రలు..
బ్రాహ్మణులను కించపరచడం మంచు ఫామిలీకి రివాజు..

చట్టాలను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తెలంగాణ ప్రాంతీయ కార్యదర్శి వక్కలంక శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం సరోజిని డాక్టర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణులను కానీ, ఇతర కులాలను కానీ, మతాలను కానీ కించపరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. మంచు మోహన్ బాబు కుటుంబం బ్రాహ్మణ జాతి పై పగబట్టిందనే బాధ బ్రాహ్మణులలో నెలకొని ఉందని శ్రీనివాస్ రావు అన్నారు. గతంలో దేనికైనా రెడీ అనే సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు చిత్రించడమే కాకుండా బ్రాహ్మణులపై భౌతిక దాడులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. తాజాగా కన్నప్ప అనే సినిమాలో పిలక-గిలక అనే రెండు పాత్రలను రూపొందించి బ్రాహ్మణులను కించపరిచారని మండిపడ్డారు.

మంచు మోహన్ బాబు కుటుంబం చట్టాలను ఉల్లంఘించిందని, కన్నప్ప సినిమాపై కోర్టులో కేసు ఉండగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం చట్టాలను ఉల్లంఘించడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. వృత్తిపరంగా బ్రాహ్మణులనే కాదు ఏ కులం వారినైనా కించపరిచే విధంగా సన్నివేశాలను చిత్రీకరించడం ఫ్యాషన్‌గా మారిందని అన్నారు. తక్షణమే మోహన్ బాబు కుటుంబం యావత్ మానవ జాతికి క్షమాపణ చెప్పి “కన్నప్ప” సినిమాలో ఉన్న పిలక-గిలక సన్నివేశాలను తొలగించాలని శ్రీనివాసరావు కోరారు. ఇందుకోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments