హైదరాబాద్,సెప్టెంబర్ 22:హైదరాబాద్ గాజులరామారంలో పేదల ఇళ్ల కూల్చివేతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు సెలవు రోజునే పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణం అని ఆయన మండిపడ్డారు.
సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన కేటీఆర్ మాట్లాడుతూ…
గతంలో హైకోర్టు స్పష్టంగా “సెలవు రోజుల్లో కూల్చివేతలు చేయరాదు” అని చెప్పిందని గుర్తు చేశారు.అయినప్పటికీ గాజులరామారంలో పేదల ఇళ్లను బుల్డోజర్తో కూల్చివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారం అని ఆరోపించారు.“గాజులరామారంలో ఇళ్లు కూల్చారు… రేపు జూబ్లీహిల్స్ బోరబండ బస్తీకీ రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారు” అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
కేటీఆర్ మాట్లాడుతూ…
“కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే మన ఇళ్లు కూలగొట్టమని బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇవ్వడమే” అన్నారు.బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేశారని, ఆ ఇంటిని మళ్లీ కట్టించి ఇవ్వడం తన బాధ్యత అని ప్రకటించారు.“కాంగ్రెస్ సినిమా అయిపోయింది… రెండు సంవత్సరాల్లో చేసిందేమీ లేదు” అని దుయ్యబట్టారు.
“పెద్దల ఇళ్లు untouched” – కేటీఆర్ విమర్శ”
హైడ్రా బుల్డోజర్ పేదల ఇళ్లపైనే వెళ్తుందని, పెద్దల ఇళ్లపైకి మాత్రం వెళ్లదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి సోదరుడు, మంత్రులు పొంగులేటి, వివేక్ వంటి వారు ప్రభుత్వ స్థలాలు, చెరువులపై ఇళ్లు కట్టినా వాటిని కూల్చలేదని ఆరోపించారు.


