Home స్పోర్ట్స్ టీమ్ ఇండియాపై గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్..

టీమ్ ఇండియాపై గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్..

0
62
Couldn't put pressure on Australia..
Couldn't put pressure on Australia..

ఆస్ట్రేలియాపై ఒత్తిడి కలిగించలేకపోయారు..

బోర్డర్‌ గవాస్కర్‌ టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టు సాధించింది. రెండురోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని.. ట్రావిస్‌ హెడ్‌ సెంచరీతో కదం తొక్కాడు. 141 బంతుల్లో 140 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ ఆస్ట్రేలియా బ్యాటర్‌పై భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసిస్తూ.. టీమిండియా ఆటగాళ్లపై విరుచుకుపడ్డారు. ఆస్ట్రేలియా బ్యాటర్లపై ఒత్తిడి పెంచడంలో భారత్‌ విఫలమైందన్నారు. భారత బౌలర్లు బౌన్సర్లు వేయలేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ట్రావిస్‌ హెడ్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తూ భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడని చెప్పారు. భారత బౌలర్లు ఇదే విధంగా చేయడంలో విఫలమయ్యారన్నారు. హెడ్‌ను షార్ట్ బాల్‌తో పరీక్షించాల్సిందని.. కానీ, భారత్‌ అలా చేయలేకపోయిందన్నాడు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here