Monday, February 23, 2026
Google search engine
Homeతెలంగాణతెలంగాణలో చలి పులి పంజా

తెలంగాణలో చలి పులి పంజా

ఉత్తర జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో చలి పులి పంజా విసురుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళ 6–8 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఉత్తర భారతదేశంలో మైనస్ డిగ్రీలతో వణికిస్తున్న చలి ప్రభావం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై కూడా పడుతోంది. హిమాలయ ప్రాంతాల నుంచి వీస్తున్న చల్లని గాలులు తెలంగాణ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనితో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు (ఫాగ్‌) ఏర్పడటంతో ఉదయం వేళ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పొగమంచుతో ఇబ్బందులు

తెల్లవారుజామున హైవేలు, గ్రామీణ రహదారులపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దృశ్యమానత తగ్గుతోంది. దీంతో రోడ్డు ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. పోలీసులు వాహనదారులు హెడ్‌లైట్లు వినియోగిస్తూ నెమ్మదిగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.

వైద్యుల హెచ్చరి

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గుండె మరియు శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చల్లని గాలులకు నేరుగా గురికాకుండా ఉండడం, వెచ్చని దుస్తులు ధరించడం, వేడి ఆహారం తీసుకోవడం అవసరమని సూచించారు. ఉదయం, రాత్రి వేళ బయటకు వెళ్లే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

మరికొన్ని రోజులు ఇలానే

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, వచ్చే రెండు నుంచి మూడు రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments