మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను తినాలనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మనం రోజూ అన్ని పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే అనేక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పలు మినరల్స్ అవసరం అవుతాయి. వాటిల్లో సెలీనియం కూడా ఒకటి. ఇది అనేక జీవక్రియలను నిర్వర్తిస్తుంది. సెలీనియం ఉన్న ఆహారాలను తరచూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. సెలీనియం వల్ల మన శరీరానికి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోగాలు రాకుండా రక్షణ వ్యవస్థ నిరంతరాయంగా పనిచేయాలి. అయితే ఇలా రోగ నిరోధక వ్యవస్థ పనిచేసేందుకు గాను సెలీనియం ఎంతగానో దోహదపడుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మార్చి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతోపాటు థైరాయిడ్ పనితీరు మెరుగు పడుతుంది. అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా కూడా సెలీనియం పనిచేస్తుంది. అందువల్ల సెలీనియం అధికంగా ఉండే ఆహారాలను తరచూ తీసుకోవాలి. సెలీనియం మనకు ఎక్కువగా పప్పు దినుసుల్లో, చిక్కుడు జాతి గింజల్లో లభిస్తుంది. ముఖ్యంగా పప్పు దినుసులతోపాటు శనగలు, రాజ్మాను తినాలి. వీటిల్లో కేవలం సెలీనియం మాత్రమే కాదు ఫైబర్ కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
చేపల్లో సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. కనుక వారంలో కనీసం 2 సార్లు అయినా సరే చేపలను తినాలి. ముఖ్యంగా సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు, ఆల్చిప్పలలో సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. అనేక రోగాల బారి నుంచి మనల్ని రక్షిస్తాయి. కోడిగుడ్డులోని పచ్చ సొనలోనూ సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల సెలీనియం కోసం కోడిగుడ్లను కూడా తినవచ్చు. పొద్దు తిరుగుడు విత్తనాలను అధికంగా తీసుకోవడం వల్ల కూడా మనకు సెలీనియం లభిస్తుంది. వీటిల్లో విటమిన్ ఇ కూడా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలో తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బ్రౌన్ రైస్, ఓట్ మీల్, హోల్ వీట్ బ్రెడ్ వంటి వాటిల్లో సెలీనియం ఉంటుంది. అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే సెలీనియం పొందవచ్చు. ఇవి మనకు చక్కని పోషణను అందిస్తాయి.
చికెన్, మటన్ వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా సెలీనియం లభిస్తుంది. వీటితో మనకు ప్రోటీన్లు కూడా లభిస్తాయి. కనుక ఆరోగ్యంగా ఉంటాము. శక్తి లభిస్తుంది. ఇలా పలు రకాల ఆహారాలను తరచూ తింటే సెలీనియం పొందవచ్చు. దీంతో అనేక వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.