Thursday, February 12, 2026
Google search engine
Homeతెలంగాణనూతన భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ సదుపాయం కల్పించాలి..

నూతన భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ సదుపాయం కల్పించాలి..

హయత్ నగర్ డివిజన్ నగర శివారు పరిసర కాలనీల్లో మురుగునీరు..
జలమండలి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ కి వినతిపత్రం..
కార్పొరేటర్ కళ్లెం నవజీవం రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం..

హయత్ నగర్ డివిజన్ లోని వాసవి కన్యకాపరమేశ్వరి కాలనీ, హయత్ నగర్ డివిజన్ నగర శివారులో, లోతట్టు ప్రాంతంలో ఉండడం.. పరిసర కాలనీలలో భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ సదుపాయం లేనందువల్ల.. ఆయా కాలనీలలో మురుగునీరు వాసవి కన్యకాపరమేశ్వరి కాలనీ ప్రధాన రోడ్లపై చేరి దుర్వాసన, విపరీతమైన దోమలతో కాలనీవాసులు అనారోగ్య బారిన పడే ప్రమాదం ఏర్పడుతుందని, వీలైనంత త్వరగా వాసవి కన్యకాపరమేశ్వరి కాలనీ, ఆ పరిసర కాలనీలలో నూతన భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ సదుపాయం కల్పించాలని, స్థానిక డివిజన్ కార్పొరేటర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డితో కలసి కాలనీవాసులు జలమండలి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు దామోదర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments