హైదరాబాద్:
ప్రతి శనివారం హైడ్రా నిర్వహించ తలపెట్టిన హైడ్రా ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఈ వారం 21వ తేదీన రద్దు చేస్తున్నట్టు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలు ఉండడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు వివరించారు. వచ్చే 28వ తేదీ నుంచి యథాతధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకూ ఉంటుందని స్పష్టం చేశారు.


