వనపర్తి జిల్లా :
రేవల్లి మండల్ తలుపునూరు గ్రామంలో జిల్లా పశుసంవర్ధక శాఖ జిల్లా పశుగణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో పాడి పశువుల గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పావని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ ఆంజనేయులు పశువులకి గర్భకోష వ్యాధి గల పశువులను గుర్తించి వాటికి చికిత్సలు జరిపారు డిజిటల్ కృత్రిమ గర్భధారణ చేసే పరికరం ద్వారా కృత్రిమ గర్భధారణ చేసి రైతులకు పశువులలో కోషంలో ఉండే ఇబ్బందులను రైతులకు చూయించి దానివల్ల కలిగే లాభాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రైతులకు లింగ నిర్ధారిత వీర్యం ద్వారా ఆడ దూడలు పుట్టి కార్యక్రమం జరుగుతుంది దానిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆడ దూడలు పుడితే రైతుకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో దూడల కు నటల నివారణ మందులు విటమిన్ ఏ ఇంజక్షన్ ఖనిజలవనాల మిశ్రమం బ్రిక్స్ అందజేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పావని మండల పశువైద్యాధికారి డాక్టర్ ఎం ఆంజనేయులు గోపాలమిత్ర సూపర్వైజర్ శ్రీనివాస్ గోపాల మిత్రుడు అనంతరాములు శోభన్ బాబు తిరుపతయ్య సిబ్బంది శివ గ్రామ పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.


