Saturday, March 14, 2026
Google search engine
Homeతెలంగాణపేదలకు కావలసింది మంచి విద్య, వైద్యం..

పేదలకు కావలసింది మంచి విద్య, వైద్యం..

వెల్లడించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
స్వర్గీయ అటల్ బీహారీ వాజ్ పేయి శత జేయండి ఉత్సవాలు..
హయత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం..

స్వర్గీయ అటల్ బీహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు హయత్ నగర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు గంగాని శ్రీను ఆధ్వర్యంలో, హయత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు..

ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ముందున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం గానీ ప్రభుత్వ పాఠశాలల పట్ల, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల పూర్తి నిర్లక్ష్యత వహిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన, విపరీతమైన దోమలతో పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని, హయత్ నగర్ లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాలతో పాటు దాదాపు 1500 విద్యార్థులు చదువుకుంటున్నారని.. వారికి కనీస మౌలిక వస్తువులతో పాటు సరిపడా ఉపాధ్యాయులు, సరిపడ తరగతి గదులు, టాయిలెట్స్ లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పేదలకు కావాల్సింది మంచి విద్య, వైద్యం.. కానీ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం పట్ల పూర్తి నిర్లక్ష్యత వహిస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచైనా పేదలకు మంచి విద్య, వైద్యం అందించాలని డిమాండ్ చేశారు..

ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్లెం రవీందర్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీను, జిల్లా నాయకులు ఉగాది ఎల్లప్ప, పారంద మహేష్, జంజ్య నాయక్, అధ్యక్షురాలు పార్వతి, డివిజన్ ప్రధాన కార్యదర్శిలు సంఘీ అశోక్, గోవింద చారి ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments