రామకృష్ణాపురం:
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని శ్రీ రామకృష్ణాపురం డివిజన్లో గల శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ 52వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన ఆదివారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చండీ హోమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ నేత పున్న నిర్మల గణేష్ నేత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ తలాటి రమేష్ నేత, ఈవో ఉమారాణి, డైరెక్టర్లు సాయికుమార్, శ్యాం సుందర్ రావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, విజయలక్ష్మి, అన్నపూర్ణమ్మతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో సందడిగా మారాయి.


