నిన్న మొన్నటివరకు బంగారం, వెండి ధరలు రోజుకో రికార్డు సృష్టిస్తూ సామాన్యుల్ని భయపెట్టాయి. ప్రతిరోజూ ధరల పెరుగుదలతో ఆభరణాల కొనుగోలు అసాధ్యమైపోయిన పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా ఆ దృశ్యం పూర్తిగా మారిపోయింది. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి.
ఈరోజు తులం బంగారం ధరపై రూ.9,050 వరకు తగ్గుదల నమోదు కాగా, కిలో వెండి ధర ఏకంగా రూ.50,000 తగ్గింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,00,000 సమీపంలో ట్రేడ్ అవుతోంది.
తాజా బంగారం ధరలు (హైదరాబాద్ మార్కెట్):
- 24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,51,530
- 22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,38,900
- 18 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,13,650
తులం బంగారం ధర తగ్గడంతో వివిధ క్యారెట్ల బంగారంపై కూడా గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.8,300, 18 క్యారెట్లపై రూ.6,790 వరకు ధరలు పడిపోయాయి.
వెండి ధరల్లో భారీ పతనం
బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధరపై రూ.50,000 తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర సుమారు రూ.3,00,000 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మారకం విలువ, లాభాల స్వీకరణ (profit booking) వంటి అంశాల కారణంగా ధరలు దిగివచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు. ధరలు తగ్గడంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది ఊరట కలిగించే పరిణామంగా మారింది.


