పలు ప్రాంతాలు జలమయం..
ట్రాఫిక్ కి విపరీతమైన అంతరాయం..
ఇక్కట్లు పడుతున్న జనాలు..
హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాన దంచికొడుతుంది. గత రెండు మూడు రోజుల నుంచి ఉక్కపోతకు గురైన నగర ప్రజలకు ఈ భారీ వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. అయితే ప్రయాణికులకు, వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి…


