Home స్పోర్ట్స్ భారత్‌ విజయలక్ష్యం 242 పరుగులు..

భారత్‌ విజయలక్ష్యం 242 పరుగులు..

0
65
ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ మధ్య దుబాయి వేదికగా మ్యాచ్‌ జరుగుతోంది.
ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ మధ్య దుబాయి వేదికగా మ్యాచ్‌ జరుగుతోంది.

చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ మధ్య దుబాయి వేదికగా మ్యాచ్‌ జరుగుతున్నది. పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆల్‌ అవుట్‌ అయ్యింది. టీమిండియాకు 242 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాకిస్తాన్‌ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. పాక్‌ బాటర్లలో సౌద్‌ షకీల్‌, కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌, ఖుష్దీల్‌ షా రాణించడంతో పాక్‌ ఆ మాత్రం స్కోర్‌ సాధించగలిగింది. టీమిండియా బౌలర్లలు కుల్దీప్‌ యాదవ్‌కు మూడు, హర్దీక్‌ పాండ్యాకు రెండు వికెట్లు, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, హర్షీత్‌ రాణాకు ఒక వికెట్‌ దక్కింది.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌కు ఇమామ్‌ ఉల్‌ హక్‌, బాబర్‌ ఆజం పాక్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. పాక్‌ బ్యాటర్లు తొందరపడకుండా ఆచితూడి ఆడేందుకు ప్రయత్నించారు. ఓపెనర్లు ఇద్దరు తొలి వికెట్‌కు 41 పరుగులు చేశారు. 8వ ఓవర్‌లో బాబర్‌ ఆజామ్‌ (23) ఔటయ్యాడు. హార్దిక్‌ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం కొద్దిసేపటికే పాకిస్తాన్‌కు మరో షాక్‌ తగిలింది. 10వ ఓవర్‌లో 47 పరుగుల వద్ద పాక్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 9.2వ బంతికి పరుగుకు ప్రయత్నించగా.. ఇమామ్‌ (10)ను అక్షర్‌ పటేల్‌ రనౌట్‌ చేశాడు. ఆ తర్వాత సౌద్‌ షకీల్‌, కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆచితూడి ఆడగా పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ స్లోగా సాగింది.

మూడో వికెట్‌కు ఇద్దరు 104 పరుగులు జోడించారు. 33.2 ఓవర్లలో మహ్మద్‌ రిజ్వాన్‌ను అక్షర్‌ పటేల్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసి ఈ జంటను విడగొట్టాడు. 34.5 ఓవర్లలో అర్ధ సెంచరీ చేసిన షకీల్‌ను పాండ్యా పెవిలియన్‌కు పంపాడు. 76 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 62 పరుగులు చేసిన షకీల్ పాండ్యా బౌలింగ్‌లో పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఇక సల్మాన్‌ ఆఘా (19), తయ్యబ్‌ తాహిర్‌ (4), షాహిద్‌ ఆఫ్రిది (0), నసిమ్‌ షా (14), హరిస్‌ రౌఫ్‌ (8) పరుగులు చేయగా.. ఖుష్దీల్‌ షా (38) పరుగులతో రాణించాడు. పాకిస్తాన్‌ బ్యాటర్లలో షకీల్‌, రిజ్వాన్‌, ఖుష్దీల్‌ షా మినహా ఎవరూ రాణించలేకపోయారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here