శివాజీ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ కార్పొరేటర్ లక్ష్మి ప్రసన్న
మన్సూరాబాద్
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని జడ్జెస్ కాలనీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ఛత్రపతి శివాజీ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బి.ఎన్. రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వరాజ్య స్థాపన కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం శివాజీ చేసిన పోరాటం మరువలేనిదని, ఆయన ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి, పరిశీలించారు. ప్రజల ఆరోగ్యం పట్ల కాలనీ వాసులు చూపిస్తున్న చొరవ అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు మారోజు షణ్ముఖ చారి, బాలగోని అంజయ్య గౌడ్, శ్రీశైలం యాదవ్, యాదయ్య, సుకుమార్, మాధవ రెడ్డి మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


