సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..
మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు..
ఓ ర్యాపిడో డ్రైవర్ మహిళా ప్రయాణికురాలిని చెంపదెబ్బ కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది.. బెంగళూరులోని జయనగర్‌లోని బాటా షోరూమ్ సమీపంలో జరిగిందీ ఘటన. ర్యాష్ డ్రైవింగ్‌పై ర్యాపిడో డ్రైవర్ని నిలదీసింది మహిళ. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో గొడవ పెద్దదైంది. మరోవైపు రాపిడో డ్రైవర్ కన్నడ మాట్లాతుండగా మహిళ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది. డబ్బుతో పాటు హెల్మెట్ ఇవ్వడానికి నిరాకరించింది మహిళ.. దీంతో రోడ్డుపై అందరూ చూస్తుండగానే మహిళను చెంపదెబ్బ కొట్టాడు ర్యాపిడో డ్రైవర్.. సోషల్ మీడియాల్లో వైరల్ మారింది ఈ వీడియో. ఈ ఘటన జూన్ 14న జరిగినట్లు తెలుస్తోంది. జ్వులెరీ షాపులో విధులు నిర్వహిస్తున్న బాధితురాలు ఘటన జరిగిన రోజు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకుంది. మార్గమధ్యలో ర్యాపిడో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాదు సిగ్నల్ కూడా జంప్ చేశాడు. ఇదే విషయాన్ని బాధితురాలు ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసింది. దీంతో ఆగ్రహం చెందిన ర్యాపిడో డ్రైవర్ జయనగర్‌లోని ఓ ప్రాంతంలో బైక్‌ను ఆపేశాడు.
వారిద్దరి మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరడంతో స్థానికులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ర్యాపిడో డ్రైవర్ మహిళా ప్యాసింజర్‌పై చేయి చేసుకున్నాడు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.