పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
హయత్ నగర్ డివిజన్ లోని మహేశ్వరి కాలనీలో జరుగుతున్న నూతన భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి జలమండలి మేనేజర్ తో కలసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్ రాబోవు కాలంలో కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సారి చూసుకుంటూ పైప్ లైన్ నిర్మాణం చేపట్టాలని మేనేజర్ కి సూచించారు.. ఈ పరిశీలనలో జలమండలి మేనేజర్ రాజు, మహేశ్వరి కాలనీ అధ్యక్షులు పాండవ్ రెడ్డి, జలమండలి సూపర్ వైజర్ బాలు నాయక్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు..


