Home తెలంగాణ మానవత్వాన్ని చాటుకున్న శ్రీశ్రీ హోమ్స్ కాలనీవాసులు..

మానవత్వాన్ని చాటుకున్న శ్రీశ్రీ హోమ్స్ కాలనీవాసులు..

0
93
Financial help to a poor woman..
Financial help to a poor woman..

నిరుపేద మహిళకు ఆర్ధిక సహాయం..
కాలనీవాసులను ఇక తాటిపై తెచ్చిన రంజిత్ రెడ్డి..

బడంగ్పేట్ కార్పొరేషన్ 26వ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ హోమ్స్ కాలనీలో గత 12 సంవత్సరాలుగా అద్దెకు నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్న నిరుపేద రాధమ్మ అనే మహిళ ఆరోగ్య సమస్య తో బడపడుతుందని తెలియగానే కాలనీ అధ్యక్షులు రంజిత్ గౌడ్ వెంటనే స్పందించి, కాలనీవాసులందరిని ఏక తాటిపై తీసుకొచ్చి కాలనీ వాసుల నుండి 53 వేల రూపాయల విరాళాలు సేకరించి రాధమ్మకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు రంజిత్ మాట్లాడుతూ ఒక నిరుపేద మహిళ అనారోగ్య సమస్యతో ఉందని తెలియగానే ఒక్క పిలుపుతో శ్రీశ్రీ హోమ్స్ కాలనీలో దాదాపు 50 మంది కాలనీవాసులు ముందుకు వచ్చి తమకు తోచిన సహాయం అందించినందుకు వారందరికీ కాలనీ అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీశ్రీ హోమ్స్ కాలనీ ప్రజలు కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారని పేర్కొన్నారు.

ఇదే విధంగా మున్ముందు కాలనీలో జరిగే మరిన్ని అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలలో కాలనీ వాసులందరూ పాలుపంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనట్లు తెలిపారు. శ్రీశ్రీ హోమ్స్ కాలనీ మిగతా కాలనీలకు ఒక మోడల్ కాలనీగా ఆదర్శవంతంగా అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రంజిత్ గౌడ్, జనరల్ సెక్రెటరీ లక్ష్మీనరసింహారెడ్డి, ట్రెజరర్ వెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here