Wednesday, April 1, 2026
Google search engine
Homeతెలంగాణముగిసిన మహా నిమజ్జన కార్యక్రమం..

ముగిసిన మహా నిమజ్జన కార్యక్రమం..

శాంతియుతంగా జరిగిన కార్యక్రమం..
అధికారులు, పోలీసుల పాత్ర అమోఘం..
నిమజ్జన వివరాలు వెల్లడించిన అధికారులు..

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో, భక్తి శ్రద్దలతో మహా గణపతి నిమజ్జన కార్యక్రమం ముగిసింది.. ఇప్పటి వరకూ దాదాపు 2 లక్షల 32 వేల 520 గణేష్ ప్రతిమల నిమజ్జనం చేశారని తెలుస్తోంది.. జీహెచ్ఎంసీ యంత్రాగం క్షేత్ర స్థాయిలో అన్ని నిమజ్జన పాయింట్ లలో ప్రతిమల నిమజ్జనం సాఫీగా, సురక్షితంగా జరిగేలా కృషి చేసింది.. పోలీసుల సహకారం మరువలేనిదని అధికారులు తెలిపారు..

జోన్ల వారిగా నిమజ్జన వివరాలను అధికారులు అందించారు..

ఎల్.బీ. నగర్ జోన్ లో 1. 5 అడుగుల నుంచి 3 వరకు విగ్రహాలు 13654, అలాగే 3 అడుగుల పైన 20633 మొత్తం 34287 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి..

చార్మినార్ జోన్ లో 1. 5 అడుగుల నుంచి 3 వరకు విగ్రహాలు 9623, అలాగే 3 అడుగుల పైన 9168 మొత్తం 18791 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి..

ఖైరతాబాద్ జోన్ లో 1. 5 అడుగుల నుంచి 3 వరకు విగ్రహాలు 21578, అలాగే 3 అడుగుల పైన 28625 మొత్తం 50203 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి..

శేరిలింగంపల్లి జోన్ లో 1. 5 అడుగుల నుంచి 3 వరకు విగ్రహాలు 11652, అలాగే 3 అడుగుల పైన 26484 మొత్తం 38136 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి..

కూకట్ పల్లి జోన్ లో 1. 5 అడుగుల నుంచి 3 వరకు విగ్రహాలు 9721, అలాగే 3 అడుగుల పైన 49126 మొత్తం 58847 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి..

సికింద్రాబాద్ జోన్ లో 1. 5 అడుగుల నుంచి 3 వరకు విగ్రహాలు 18765, అలాగే 3 అడుగుల పైన 13491 మొత్తం 32256 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి..

మొత్తానికి 1. 5 అడుగుల నుంచి 3 వరకు విగ్రహాలు 84993, అలాగే 3 అడుగుల పైన 147527 మొత్తం 232520 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని అధికారులు తెలియజేశారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments