Thursday, March 12, 2026
Google search engine
Homeతెలంగాణమెడికల్ అండ్ హెల్త్ కాలనీలో రోడ్డు పనులను పరిశీలించిన ముద్దులచి రెడ్డి.

మెడికల్ అండ్ హెల్త్ కాలనీలో రోడ్డు పనులను పరిశీలించిన ముద్దులచి రెడ్డి.

బి.ఎన్. రెడ్డి నగర్:

డివిజన్ పరిధిలోని మెడికల్ అండ్ హెల్త్ కాలనీలో జరుగుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి బుధవారం పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, నిర్ణీత ప్రమాణాల ప్రకారం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు.
​అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాలనీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మూర్తి, ప్రతినిధులు రామారావు, నాగయ్య, ఇంజినీరింగ్ విభాగం వర్క్ ఇన్‌స్పెక్టర్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments