నూతన కమిటీ ఏకగ్రీవ ఎంపిక..
తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అసోసియేషన్ (మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్ను కోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా బీ.పీ. ఆనంద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కె. పీటర్ సన్ , కోశాధికారిగా కొంపెళ్లి మత్స్యగిరి ,రాష్ట్ర లైజనింగ్ ఆఫీసర్లుగా టీ. రాజ్ కుమార్, కోటేశ్వరరావులు.. అదే విధంగా ఉపాధ్యక్షులుగా కే. మల్లికార్జునరావు, సబిత వేనిగా, మహేశ్, రఫ్ఫత్ సుల్తానా, శ్రీనివాస్ బాజీ లు, జాయింట్ సెక్రెటరీలుగా డానియల్ సుకుమార్, శ్రీనివాస్, శివ కుమార్ లు, అలాగే రాష్ట్రంలో ఉన్న ఒకటి నుండి ఏడు జోన్ల ఇంచార్జీలను, కార్యవర్గ సభ్యులుగా సంజయ్, తిరుమల్‌రెడ్డి, శివకుమార్, మహేష్, భాస్కర్, కె. శ్రీనివాస్, మొషిం, సంజయ్ కుమార్, లక్ష్మీనర్సయ్యలను పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది..
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బీ.పీ. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. స్టాటిస్టికల్ అసోసియేషన్ లో ఉన్న సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తానని, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రమోషన్స్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది.. అనంతరం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా. రవీందర్ నాయక్ ను మర్యాదా పూర్వకంగా కలిసి, అసోసియేషన్ సమస్యల గురించి విజ్ఞప్తి చేస్తూ.. సన్మానించడం జరిగింది. అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…