Sunday, June 22, 2025
Google search engine
Homeఎడ్యుకేషన్యూజీసీ నెట్‌ పరీక్ష తేదీలు ఇవే..

యూజీసీ నెట్‌ పరీక్ష తేదీలు ఇవే..

యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2024 ఎగ్జామ్‌
పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్‌టీఏ
జనవరి 3 నుంచి 16 వరకు పరీక్షల నిర్వహణ

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. దేశవ్యాప్తంగా జనవరి 3 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన కేంద్రాల్లో జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు యూజీసీ వెల్లడించింది. ఇది వరకు జనవరి 1 నుంచి 19 వరకు జరగుతాయని వార్తలు వెలువడ్డాయి. అయితే తాజా షెడ్యూల్‌ ప్రకారం.. జనవరి 3 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

మొత్తం 85 సబ్జెక్టులకు నిర్వహించే సీబీటీ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కి అప్పగించింది. ఈ పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్‌లో నవంబర్‌ 19 నుంచి డిసెంబర్‌ 10 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ అవార్డు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments