Wednesday, March 25, 2026
Google search engine
Homeతెలంగాణవిజయపురి కాలనీలో బీటీ రోడ్డు పనుల పరిశీలన.

విజయపురి కాలనీలో బీటీ రోడ్డు పనుల పరిశీలన.

బీ.ఎన్. రెడ్డి నగర్:

డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ ఫేస్-1లో కొత్తగా చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పర్యవేక్షించారు. పనుల నాణ్యతను పరిశీలించిన ఆయన, కాలనీల సమగ్ర అభివృద్ధికి తాము నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
​అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా, నిబంధనల ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కాలనీల్లో ఎలాంటి సమస్యలున్నా నేరుగా తమ దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి తక్షణమే చొరవ చూపుతామని భరోసా ఇచ్చారు.
​ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రావు, సభ్యులు శ్రీనివాస్ రావు, మాణిక్ ప్రభు పాల్గొన్నారు. అలాగే బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments