Home తెలంగాణ శానిటేషన్ డ్రైవ్..

శానిటేషన్ డ్రైవ్..

0
54
The program is being held in the wake of the onset of the rainy season..
The program is being held in the wake of the onset of the rainy season..

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కార్యక్రమం..
ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని చేస్తున్నాం..
వెల్లడించిన స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి..

గురువారం రోజు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వైదేహి నగర్, సచివాలయ నగర్ లో జిహెచ్ఎంసి శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్యతో కలిసి ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,. కాలనీలో పేరుకుపోయిన మట్టి కుప్పలు, చెత్త కుప్పలను తొలగించడం జరుగుతుందని, రోడ్లు శుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి శానిటేషన్ డీఈ నీలిమ, వైదేహి నగర్ కాలనీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, సచివాలయ నగర్ కాలనీ అధ్యక్షులు పి.సాంబశివరావు, హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు బాబురావు, జనరల్ సెక్రెటరీ బాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, ట్రెజరర్ రవికుమార్, స్పోర్ట్స్ సెక్రటరీ శ్రీధర్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ యాదయ్య, రవికుమార్, ఇప్ప నరసింహారెడ్డి, చందు, హరి గోపాల్, విజయ్, ఫణి రాజు, సుధీర్ కుమార్, వైదేహి నగర్ కాలనీ ఉపాధ్యక్షులు ఏ కిషన్ రావు, అచ్చయ్య, రామ్మోహన్ చౌదరి, మీనేష్, సురేష్, ఆదినారాయణ, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ మల్లేశం, శానిటేషన్ ఎస్.ఎఫ్.ఏ. పార్టీ నాయకులు శంకరయ్య గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, కామేశ్, పవన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గౌరీ శంకర్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here