Home స్పోర్ట్స్ శ్రీలంకతో సిరీస్‌ గెలిచిన ఆఫ్రికా..

శ్రీలంకతో సిరీస్‌ గెలిచిన ఆఫ్రికా..

0
96
South Africa has reached the first position in the WTC points table.
South Africa has reached the first position in the WTC points table.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకున్న దక్షిణాఫ్రికా..

స్వదేశంలో శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో గెలుచుకుంది. 348 పరుగుల భారీ ఛేదనలో భాగంగా ఆట చివరిరోజు ఓవర్‌ నైట్‌ స్కోరు 205/5తో బ్యాటింగ్‌కు వచ్చిన లంకేయులు.. మరో 33 పరుగులు మాత్రమే జోడించి 238కు ఆలౌట్‌ అయ్యారు. సఫారీ స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ (5/76) లంక పనిపట్టాడు. కెప్టెన్‌ ధనంజయ డిసిల్వ (50) కుశాల్‌ మెండిస్‌ (46) ఔట్‌ అవడంతో సఫారీల విజయం ఖాయమైంది. డేన్‌ పీటర్సన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, సౌతాఫ్రికా సారథి టెంబ బవుమాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కింది. ఇక ఈ విజయంతో వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. 63.33 శాతంతో దక్షిణాఫ్రికా తొలి స్థానాన్ని దక్కించుకోగా 60.71తో ఆస్ట్రేలియా రెండో స్థానాన నిలిచింది. 57.29 శాతంతో భారత్‌ మూడో స్థానంలో ఉంది. ఈనెలాఖరున పాకిస్థాన్‌తో సొంతగడ్డపై జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఒక్కటి గెలిచినా సఫారీలు డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంటారు. భారత్‌ విషయానికొస్తే.. ఆసీస్‌తో ఆడబోయే మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిస్తేనే మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా మూడోసారి ఫైనల్‌కు చేరుకునే అవకాశముంటుంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here