Monday, March 9, 2026
Google search engine
Homeతెలంగాణఅంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు – మహిళా పోలీసులకు సన్మానం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు – మహిళా పోలీసులకు సన్మానం.

ఎల్బీనగర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్.హెచ్.ఓ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారులను, సిబ్బందిని సీఐ వినోద్ కుమార్ ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ, పోలీస్ వ్యవస్థలో మహిళా సిబ్బంది కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, సమాజ రక్షణలో మహిళా పోలీసులు చూపుతున్న నిబద్ధత గర్వకారణమని ఆయన ప్రశంసించారు. మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments