ఈ సందర్బంగా ఘన నివాళులు అర్పించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
“అందేరి మే ఏక్ చింగారి – అటల్ బిహారి,అటల్ బిహారీ”..
హయత్ నగర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 7వ వర్ధంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ గా ఆయన జీవితం ప్రారంభించి, రాజకీయాలలో అత్యున్నత పదవి చేపట్టి, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలను గడగడాలాడించి, ఒక ఓటును అక్రమంగా కొనలేక తన ప్రభుత్వాన్ని తృణ ప్రాయంగా వదులుకున్న మహా నేత…మూడు సార్లు ప్రదాని పదవి చేపట్టి సొంతంగా ఇల్లు కూడా నిర్మించుకోని నిస్వార్ధ నాయకుడు, ఆయన చూపిన బాటలో నడుస్తూ.. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపితం చేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జాంజా నాయక్, పారంద మహేష్, డివిజన్ కార్యవర్గ సభ్యులు గోవింద చారి, జనార్దన్, నర్సింహా, సురేష్ రెడ్డి, సూర్య నాయక్, బాలు, అరుణ్ బీజేవైఎం నాయకులు ప్రేమ్, అఖిల్, భరత్, ప్రణవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..


