Monday, June 23, 2025
Google search engine
Homeఇంటర్నేషనల్అట్టహాసంగా జరుగనున్న ట్రంప్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం..

అట్టహాసంగా జరుగనున్న ట్రంప్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం..

చైనా అధ్యక్షుడికి అందిన ఆహ్వానం..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కు కూడా ఆహ్వానం పంపినట్లు తెలిసింది. ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాల్సిందిగా జిన్‌పింగ్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. నవంబర్‌లోనే ఆహ్వానం పంపినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. అయితే, ఈ వార్తలపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇదిలా ఉండగా.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్‌ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments