Friday, February 20, 2026
Google search engine
Homeతెలంగాణఅవయవ దాత అంతిమ యాత్రలో ప్రభుత్వ అధికారి పాల్గొనాలి

అవయవ దాత అంతిమ యాత్రలో ప్రభుత్వ అధికారి పాల్గొనాలి

హైదరాబాద్:

నిమ్స్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న జీవనధాన్ రాష్ట్ర ప్రధాన కోఆర్డినేటర్ డా.డి. భూషణ్ రాజుని ఆయన ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర శరీర అవయవ దాతల సంఘం గౌరవ అధ్యక్షుడు డా.ఎస్. రామచంద్ర రావు, నేషనల్ కోఆర్డినేటర్స్ ఎల్వి కుమార్, ఎస్.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జి.గురుప్రకాష్ , ఉపాధ్యక్షులు సీహెచ్ ఇందిరా, సీహెచ్.మేరీ రత్నకుమారి, సభ్యులు కేవీవీ. ప్రసాద రావు, ఉప్పల శ్యాంసుందర్ లు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి సంఘ కార్యక్రమాలు వివరించి, కొన్ని విషయాల మీద త్వరతిగతిన చర్యలు తీసుకోవాలని సంతకాలతో వినతిపత్రం సమర్పించారు.1. అవయవ దానం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులను జాతీయ పండుగల రోజున సంబంధిత జిల్లాల కలెక్టర్ స్థాయి అధికారితో మెమెంటో, పూలదండ,శాలువ, సన్మాన పత్రంతో సత్కారం చేయాలి.2. అవయవ దాత అంతిమ సంస్కార కార్యక్రమంలో సంబంధిత జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి తప్పని సరిగా పాల్గొంటే, ప్రజలలో ఈ విషయంపై అవగాహన పెరిగి అవయవ దానం కోసం ముందుకు రాగలరు.వీలు కాని యెడల క్రింది స్థాయి అధికారి అయినా తప్పక పాల్గొనాలి.3.అవయవ శరీర దానం సంబంధించిన ప్రభుత్వ జీవోలు విధిగా సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.4.అవయవ దానం చేసిన వ్యక్తి తాలూకా ప్రైవేటు/ కార్పొరేట్ హాస్పిటల్ లో అయిన వైద్య ఖర్చులు, ఆ కుటుంబ సభ్యులకు తిరిగి ఇప్పించాలి. 5.అవయవ దాత శరీరాన్ని శ్మశానవాటికకు తరలించుటకు ఉచిత ప్రభుత్వ వాహన సదుపాయం కల్పించాలని వినతి చేశారు.ఈ సందర్భంగా భూషణ్ రాజు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర శరీర అవయవ దానం సంఘం అధ్యక్షులు శ్రీమతి గూడూరి సీత మహాలక్ష్మీ ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. తన నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీ సంఘానికి అండగా ఉంటుందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments