హెచ్చరించిన రాచకొండ సిపి జి.సుధీర్ బాబు, ఐపిఎస్.,
గత నెల రోజుల్లో 240 మంది పోకిరీలను పట్టుకున్న రాచకొండ షీ టీమ్స్..
బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు,ఐపిఎస్., తెలిపారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని.. బాలికలను, మహిళలను వెంబడించే, వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ.., వారిని,వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారని అన్నారు.
రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు మంగళవారం రోజు రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిదిలో మహిళలను, యువతులను వేదింపులకు గురిచేస్తున్న 240 ఇందులో మేజర్స్-160 ,మైనర్స్-80 మందిని షీ టీమ్స్ పట్టుకున్నారు. వారికి ఎల్‌బి నగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలర్స్ తో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గత నెల తేదీ 1 నుండి 31 తేదీ వరకు 288 పిర్యాదులు అందినాయని తెలిపారు..
అందిన ఫిర్యాదులలో..,
ఫోన్ల ద్వారా వేదించినవి 42, సోషియల్ మీడియా యాప్స్ ద్వారా వేదించినవి 102 , నేరుగా వేదించినవి 144 ఉన్నాయని
వాటిలో క్రిమినల్ కేసులు 18, పెట్టి కేసులు 122, 110 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని విమెన్ సేఫ్టీ వింగ్ డి.సి.పి టి. ఉషారాణి తెలిపారు.
కొన్ని ముఖ్యమైన కేసులు :
మైనర్ బాలికను లైంగికంగా వేదించిన సీనియర్ సిటిజన్ అరెస్టు :
షీ టీమ్ కి అందిన పిర్యాదు మేరకు, గత మూడు సంవత్సరాలుగా మైనర్ బాలిక కుటుంబ సభ్యులు నిందితుని ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. ఇంటి యజమాని అయిన నిందితుడు ( వయసు 73 సంవత్సరాలు) ఇంట్లో ఎవరూ లేనప్పుడు మైనర్ బాలిక దగ్గరికి వచ్చి శారీరక వేధింపులకు గురిచేసేవాడు. అందరూ ఉన్నప్పుడు సదరు నిందితుడు బాలిక కుటుంబ సభ్యులతో స్నేహంగా ప్రవర్తించేవాడు, దీంతో అతనిపై ఎవరికి అనుమానం వచ్చేదికాదు. అతని శారీరక వేధింపులు గురించి బాలిక, కుటుంబ సభ్యులకు తెలియచేసిన, అతను అలాంటివాడు కాదు అని బాలికను మందలించారు. దీంతో ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో బాలికకు అర్ధం కాలేదు. నిందితుడు అలవాటు ప్రకారంగా ఒక రోజు బాలిక దగ్గరికి వచ్చి లైంగికంగా వేదిస్తుంటే అతనికి తెలీయకుండా ముందుగానే మొబైలు ఫోన్ రికార్డు ఆన్ చేసి పెట్టింది. తరువాత రికార్డు చేసిన సంఘటనను బాలిక కుటుంబ సభ్యులకు చూయించింది. ఇట్టి విషయంపై షీ టీం వారిని సంప్రదించగా పోలీస్ స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపడమైనది.
ఓయో రూమ్ కి రాకపోతే ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు :
షీ టీమ్ కి అందిన పిర్యాదు మేరకు, యువతి క్రికెట్ కోచింగ్ తీసుకుంటుంది, అదే క్రికెట్ కోచింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకునే వ్యక్తి తరచుగా ఆమెతో మాట్లాడు తుండెవాడు వాడు. నిందితుడు యువతితో స్నేహంగా మాట్లాడుతూ తనని ప్రేమిస్తున్నానని చెప్పడంతో యువతి తిరస్కరించింది. దీంతో నిందితుడు యువతిని ప్రేమించకపోయిన పరవాలేదు, ఓయో రూమ్ కి రా..! లేకపోతే క్రికెట్ ఆడుతున్న సమయంలో దిగిన ఫోటోలు మర్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించినాడు. ఇట్టి విషయంపై షీ టీం వారిని సంప్రదించగా పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేయడమైనది.
ఆన్లైన్ గేమింగ్ ఆప్ ద్వారా వేధింపులు :
షీ టీమ్ కి అందిన పిర్యాదు మేరకు, బాలికకు ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్ (లూడో) ద్వారా పరిచయం అయి, తర్వాత నిందితుడు బాలికకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా మెసేజ్ చేసేవాడు. కొన్ని నెలల తర్వాత, ఆమె అతని ప్రవర్తన కారణంగా అతనితో మాట్లాడడం మానేసింది. అందువల్ల,నిందితుడు తన వద్ద వీడియోలు, చిత్రాలు ఉన్నాయని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇట్టి విషయంపై షీ టీం వారిని సంప్రదించగా పోలీస్ స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపడమైనది.
రెండు బాల్య వివాహలు నిలుపుదల :
ఇబ్రహీంపట్నం, నారాయణపూర్ ఏరియాలో బాల్య వివాహలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో షీ టీంలు వెంటనే స్పందించి జిల్లా బాల-బాలికల సంరక్షణ విభాగం అదికారులతో సంఘటన స్థలానికి చేరుకొని . బాల్య వివాహం చట్టరీత్యా నేరం అని వారికి అవగాహన కల్పించి , బాల్య వివాహాలని అడ్డుకొని, మైనర్ బాలికలకు బాల్య వివాహంనుంచి విముక్తి కల్పించడం జరిగింది.
బస్ స్టాండ్ లో న్యూసెన్స్ పోకిరీలు అరెస్టు :
బస్ స్టాండ్ వద్ద న్యూసెన్స్ చేస్తున్నారని సమాచారం రావడంతో వెంటనే స్పందించిన షీ టీమ్ అక్కడికి చేరుకొని న్యూసెన్స్ చేస్తున్నా ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారిపై పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.
అవగాహన కార్యక్రమాలు :
గత నెల తేదీ 1 నుండి 31 తేదీ వరకు షీ టీమ్స్ రాచకొండ మొత్తం 94 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు 12753 మందికి మహిళా చట్టాలు, వారి యొక్క హక్కులు, నేరాలు మరియు జాగ్రత్తల గురించి వివరించి అవగాహన కల్పించడం జరిగింది.
మెట్రో-రైల్ డెకాయ్ఆపరేషన్స్ :
రాచకొండ షీ టీమ్స్ మెట్రో రైళ్లలో డెకాయ్ ఆపరేషన్సు నిర్వహించి, మహిళా కంపార్మెంట్‌లోకి వెళ్ళి ప్రయాణిస్తున్న (10) మంది పురుషులను పట్టుకుని మెట్రో స్టేషన్ అదికారుల ద్వారా ఫైన్ వేయించడం జరిగింది.
మహిళలు వేదింపులకు గురి అయినప్పుడు వెంటనే షీ టీమ్స్ ని, రాచకొండ వాట్స్ ఆప్ నెంబర్ : 8712662111 ద్వారా లేదా ఆ ప్రాంత షీ టీమ్ అధికారుల నంబర్లు భువనగిరి ఏరియా : 8712662598, చౌటుప్పల్ ఏరియా : 8712662599, ఇబ్రహీం పట్నం ఏరియా 8712662600, కుశాయ్ గూడా ఏరియా : 8712662601, ఎల్.బీ. నగర్ ఏరియా : 8712662602, మహేశ్వరం ఏరియా : 8712665299, మల్కాజ్ గిరి ఏరియా – 8712662603, వనస్థలిపురం ఏరియా : 8712662604, యాదాద్రి ఏరియా : 8712665300 లకు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ వింగ్ డి.సి.పి టి. ఉషా రాణి, ఇన్స్పెక్టర్లు ఎం. ముని, జె. హనుమంతు, జి. అంజయ్య, అడ్మిన్ ఎస్‌ఐ రాజు, షీ టీమ్స్ సిబ్బంది, కౌన్సిలర్స్ పాల్గొన్నారు..


