సూటిగా ప్రశ్నించిన కప్పాటి పాండురంగా రెడ్డి..
ఒక పత్రికా ప్రకటన ద్వారా తీవ్రంగా స్పందించిన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్..
మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. అరవైయేండ్ల నిరీక్షణ.‘మా తెలంగాణ మాగ్గావాలె’ అని.. ఊరూవాడ ఒక్కటి చేసి సబ్బండ వర్నాలను ఏకంచేసి తెలంగాణ సాదనలో కీలక పాత్ర వహించిన కోదండరామ్ పైననా మీ కుట్రలు.. నిఖార్సయిన ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని మంటగలపడానికి, వారి అస్తిత్వాన్ని అవహేళన చేయడానికి బిఅర్ఎస్ పన్నని కుట్రలు లేవు. ఆడని డ్రామా లేదు. నాడు సమక్యవాదుల కుతంత్రాలను తిప్పికొట్టడానికి.. ఉద్యమ తీవ్రతను.. స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పడానికి దండోరా వేసి.. దండును కూడగట్టి.. ‘జై తెలంగాణ’ అంటూ పురుడు పోసుకున్నది కోదండరామ్ ఛైర్మన్ గా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ.. వారి ఆద్వర్యంలో సకల జనుల సమ్మే, సాగరహారం లాంటి అందోలనలతోనే కదా తెలంగాణ రాష్ట్రం సహకారం అయ్యింది. అలాంటి నికార్సైన తెలంగాణ ఉద్యమ నాయకుడి పైననా మీ అక్కసు..?.తెలంగాణ. ఆత్మగౌరవ ప్రతీకగా పరిపాలనా కొనసాగాలి అన్నందుకా, తెలంగాణ అస్తిత్వాన్ని గొప్పగా చాటేలా పరిపాలన ఉండాలన్నందుకా కోదండరామ్ పైన పగ..? తెలంగాణ పునర్నిర్మాణంలో ఎక్కడ ముఖ్య భూమిక పోషిస్తాడో అన్న దుష్ట సంకల్పంతో కోదండరామ్ ని పరిపాలనలో భాగస్వామ్యం కాకుండా చేసింది బిఅర్ఎస్.
బిఅర్ఎస్ చేసే కుట్రలను తెలంగాణ ప్రజలు హర్షించరని బిఅర్ఎస్ నాయకులు గ్రహించాలని పాండురంగా రెడ్డి హెచ్చరించారు..


