ఎల్బీనగర్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి…
మంత్రి వెంట ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్..
వనస్థలిపురం జంక్షన్ లో కార్యక్రమం..
ఎల్బీనగర్ నుండి పెద్ద అంబర్ పేట వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి వనస్థలిపురం జంక్షన్ లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసిన రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. మంత్రి వెంట ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఆర్డీసి చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, స్థానిక నేతలు ఉన్నారు..

ఈసందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు నాకు తెలుసు.. ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ది కోసం కృషి చేశాను.. ఇప్పుడు రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా ఉన్నాను..ఈ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తాను.. సుమారు 650 కోట్ల వ్యయంతో ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయబోతున్నాం.. హైదరాబాద్ నుండి విజయవాడ రెండు గంటల్లో చేరుకునేలా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నాం అని తెలిజేశారు..

కేంద్ర మంత్రి గడ్కరీని ఈనెల 6న కలుస్తాం.. హైదరాబాద్ ను అభివృద్ది చేశామంటున్న కేటీఆర్.. ఉప్పల్ నారపల్లి ఫ్లై ఓవర్ ఎందుకు పూర్తి చేయలేదు అని ప్రశ్నించారు.. పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏమార్చింది..అభివృద్ది చేయలేదు.. బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణ చేసింది.. ప్రజలే దేవుళ్ళుగా మారి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. బీసీ రిజర్వేషన్లు కేసిఆర్ బిడ్డకు ఏం పని.. 10ఏళ్లు ఎందుకు మాట్లాడలేదు బీసీల గురించి అని ప్రశ్నించారు..

ఎవరెంతో వారికంతా ఇవ్వాలనేది మా ఇందిరమ్మ ప్రభుత్వ విధానం.. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం..అని మంత్రి కోమటి రెడ్డి తెలియజేశారు..
ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ… నెల రోజుల క్రితమే స్థానిక కాలనీ వాసులు వంద మందితో కలిసి మంత్రిని కలిశాను.. జనాభా తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో రద్దీ నియంత్రణ కోసం వెహికల్ అండర్ పాస్ లకు బదులుగా ఫ్లైఓవర్ లు ఎంతో అవసరమని, స్థానిక ప్రజలకు ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు, కాలనీ వాసులు సులభంగా రోడ్లు దాటేలా ఫ్లైఓవర్ లు నిర్మించాలని వినతి పత్రం అందజేశాము. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి గారు హామీ ఇచ్చారు.. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు..