Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణఏ కాలనీ కూడా ముంపు సమస్యకు గురికాకూడదు..

ఏ కాలనీ కూడా ముంపు సమస్యకు గురికాకూడదు..

అందుకే శాశ్వత ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం..
వెల్లడించిన స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..

బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్, శ్రీపురం కాలనీ, హరిహరపురం, బి.యన్ రెడ్డి నగర్, లుంబిని ఎలైట్స్, వినూత్న ఎన్క్లేవ్, గ్రీన్ సిటీ కాలనీ, స్వామి నారాయణ కాలనీలలో గత కొంతకాలంగా వర్షపు నీరు, మురుగునీరు చేరి కాలనీలలో విపరీతమైన దుర్వాసనతో బాటు దోమల బెడద ఎక్కువగా ఉందని కాలనీవాసులు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది.. ఈ క్రమంలో బుధవారం రోజు వివిధ కాలనీలకు సంబంధించిన సంక్షేమ సంఘం ప్రతినిధులతో అటవీ శాఖ ఎఫ్.ఆర్.ఓ. శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. అతి త్వరలోనే ఏ కాలానికి ఇబ్బంది కలగకుండా వీలైనంత త్వరగా స్ట్రామ్ వాటర్ డ్రైన్, డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మించుకునే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నామని.. ఏ కాలనీ కూడా ముంపు సమస్యకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం జలమండలి, జిహెచ్ఎంసి అధికారులతో సమీక్ష నిర్వహించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్.ఆర్.ఓ. కసనా నాయక్, జలమండలి డీజీఎం రాజగోపాల్, మేనేజర్ సిరివెన్నెల, ఇంజనీరింగ్ విభాగం ఏఈ గోపాలకృష్ణ, హరిహరపురం కాలనీ అధ్యక్షులు శంకరయ్య గౌడ్, వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పద్మా రెడ్డి, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ ఫేస్ 2 అధ్యక్షులు మహేందర్ రెడ్డి, దేవి పోచమ్మ ఆలయ చైర్మన్ ప్రదీప్ రెడ్డి, లుంబిని ఎలైట్స్ కాలనీ అధ్యక్షులు సునీల్ రెడ్డి, అఖిలాండేశ్వర కాలనీ అధ్యక్షులు సోమేశ్వరరావు, శ్రీపురం కాలనీ జాయింట్ సెక్రెటరీ నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శులు సందీప్ రెడ్డి, అశోక్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మహేశ్వరరావు, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వైస్ చైర్మన్ శ్రీధర్ రావు, శ్రీపురం కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన కార్యదర్శి చంద్రయ్య, ట్రెజరర్ కసిరెడ్డి జంగయ్య గౌడ్, హరిహర పురం కాలనీ జాయింట్ సెక్రటరీ నరేష్, మాజీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, సభ్యులు కాంతారావు, బాలు, కాలనీ సభ్యులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments