శంకరా ఆసుపత్రి వారి చొరవ అభినందనీయం..
బాధితురాలు నేమూరి లలితను పరామర్శించిన కమిషనర్ సరస్వతి..
బడంగ్ పేట్ నగర పాలక సంస్థ పరిధిలో స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్న నేమురి లలితకు కంటి సమస్య ఉండగా శంకరా ఆసుపత్రి వారు ఆమెకు కంటి వైద్యం విజయవంతగా పూర్తిచేసినారు. ఈ సంధర్బంగా బడంగ్ పేట్ మునిసిపల్ కమిషనర్ పి. సరస్వతి తాను స్వయంగా మల్లాపూర్ లోని బాధితురాలు యొక్క నివాసమునకు వెల్లి.. లలిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికురాలికి ఆరోగ్యమే ప్రధానమే అని అవసరమైన వైద్య సేవలు అందించడానికి బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పటికీ కట్టుబడి ఉంటదని తెలిపారు.. నేమురి లలితకి కుటుంబ సభ్యులకు కమీషనర్ ధైర్యం చెప్పారు.. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ వంకాయల యాదగిరి, జవాన్, వార్డ్ ఆఫీసర్ కూడా పాల్గొని లలితకు సంఘీభావం తెలియజేశారు..