పిలుపునిచ్చిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్..
సామాజిక న్యాయ సమర భేరి పేరుతో నిర్వహిస్తున్న సభకు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నట్లు వెల్లడి..
సన్నాహక సమావేశానికి హాజరైన పార్టీ జనరల్ సెక్రెటరీలు గజ్జెల కాంతం, శశికళ యాదవ రెడ్డి, మిథున్ రెడ్డి..
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్న గ్రామ శాఖల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎల్బీనగర్ నుంచి భారీగా తరలి వెళ్దామని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ పిలుపు నిచ్చారు..
ఎల్బీ స్టేడియంలో నేడు జరగనున్న గ్రామ శాఖ అధ్యక్షుల సమ్మేళనం, సామాజిక న్యాయ సమరభేరి సభను విజయవంతం చేయడం కోసం ఎల్బీనగర్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని గురువారం హయత్ నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. మధుయాష్కీ గౌడ్ తో పాటు.. టీపీసీసీ జనరల్ సెక్రెటరీ లు గజ్జలకాంతం.. మిథున్ రెడ్డి.. శశికళ యాదవ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానం ఎంతో ముఖ్యమని అప్పుడే.. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ దిశగా పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానం మరింత పెంచేందుకు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్న ఈ సమ్మేళనం ఎంతో ముఖ్యమన్నారు. దేశంలోనే మొదటిసారిగా గ్రామశాఖ అధ్యక్షులతో పార్టీ జాతీయ అధ్యక్షుడి సమ్మేళనం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఎంతో మంది కార్యకర్తలు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం వేచి చూస్తున్నారని, వారి బాధ తాను అర్థం చేసుకోగలుగుతున్నానని వివరించారు. వారికి పదవులు ఇచ్చే విషయాన్ని ఇప్పటికే అధిష్టానానికి వివరించినట్లు పేర్కొన్నారు. నగరంలో పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు లేనందున ఇక్కడ కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో పాటు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని అధిష్టానానికి వివరించినట్లు పేర్కొన్నారు.
ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఎల్బీనగర్ నియోజకవర్గ అంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో అభిమానం అని, ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారన్నారు. త్వరలో ఆయనతో సమావేశమై నియోజకవర్గ సమస్యలపై చర్చించనున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నా.. అవి సరైన రీతిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని, ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఏ బహిరంగ సభ నిర్వహించినా.. ఎల్బీనగర్ నుంచి భారీగా జన సమీకరణ చేపడుతున్నామని, ఎల్బీ స్టేడియంలో జరిగే ఖర్గే సభకు కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి భారీగా వెళ్దామని పేర్కొన్నారు.
మల్కాజ్గిరి పార్లమెంటు ఇంచార్జ్ లుగా విచ్చేసిన టిపిసిసి జనరల్ సెక్రెటరీలు గజ్జెల కాంతం, మిథున్ రెడ్డి, శశికళ యాదవ రెడ్డిలు మాట్లాడుతూ.. ఖర్గే సభకు హాజరు కావడమే కాకుండా ప్రతి కార్యకర్త సోషల్ మీడియాలో సభను విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ పార్టీల పని అయిపోయిందని, ఇదే అవకాశంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వారు వివరించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని, ఆయన సారథ్యంలో మధుయాష్కీ కి భవిష్యత్తులో మంచి హోదా లభిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఇప్పటికే రాష్ట్రంలో ప్రముఖ స్థానంలో ఉండేవారని పేర్కొన్నారు. మధుయాష్కీ అంటే కేవలం ఎల్బీనగర్ కే పరిమితం కాదని.. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు తెలిపిన నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చి.. సభను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
సీనియర్ నాయకులు, న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టిపిసిసి కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాష్ గౌడ్, ముద్దగొని లక్ష్మీ ప్రసన్న, డివిజన్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, చెన్నగోని రవీందర్, బండ సురేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, లింగాల కిషోర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బుడ్డా సత్యనారాయణ, నేలపాటి రామారావు, పన్యాల జైపాల్ రెడ్డి, ఎస్టీ సెల్ ఎల్బీనగర్ అధ్యక్షులు రమేష్ నాయక్, మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ షాకీర్, దేవాలయ కమిటీ డైరెక్టర్లు కంచర్ల కవిత, ఓరుగంటి నరేష్, తోకటి కిరణ్, సాయికుమార్, కొండోజు శ్రీనివాస్, నాయకులు డేరంగుల కృష్ణ, కందికంటి శ్రీధర్ గౌడ్, పాలకూరి రవికాంత్, స్వర్ణ మాధవి, రజిని రావు, అక్కనపల్లి రాజేశ్వరి, వసంత, అనసూయ, గణేష్ రెడ్డి, రేణు గౌడ్, అంతటి శ్రీనివాస్, మెరుగు రమేష్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సాయి నికేష్, ఐరిగి రమేష్, రమాకాంత్, బొగ్గారపు శరత్, వరుణ్, చెరుకు భవాని శంకర్, శ్రావణ్ గుప్తా, జాంగిర్ బాబు, పెద్దలు, మల్లికారున్, సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.