పిలుపునిచ్చిన కప్పాటి పాండురంగా రెడ్డి..
కె.ఎల్.ఆర్. ఆదేశాల మేరకు కార్యక్రమం..
కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని తుక్కుగూడ మున్సిపాలిటీ సంస్థాగత ఎన్నికల సమన్వయ కర్త, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు.
మంగళవారం నాడు తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపాలిటీ క్రియాశీలక సభ్యులు, ముఖ్యనాయకులు, క్లసర్ కన్వీనర్, కో కన్వీనర్, సభ్యులతో కలసి కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కెఎల్ఆర్ అదేశాల మేరకు సమావేశం నిర్వహించారు.. మహిళలకు, యువతకు కమిటీలలో ప్రాధాన్యత ఇస్తూ.. మునిసిపాలిటీలోని వార్డు కమిటీలు అనుబంధ విభాగాల కమిటీలు, ఇందిరమ్మ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని.. పార్టీ కోసం కస్టపడి పనిచేసిన వారికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పార్టీ కోసం శ్రమించిన వారికి తప్పక గుర్తింపు లభిస్తుందనే భరోసా వారికి ఇవ్వాలని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కొత్త, పాత నాయకుల సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు.
అదే విదంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంశం, జరిగిన దోపిడీ, చేసిన అవినీతిని ఎండగడతూ ప్రతిపక్షాల అసత్య ఆరోపణలను త్రిప్పికొడుతూ.. మీడియా, సోషల్ మిడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న గడప గడపకు ప్రజా సంక్షేమ పథకాలు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ సేవలు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్ పంపిణీ, రైతుల రుణమాఫీ, రైతు భరోసా, రేషన్ ద్వారా ఇస్తున్న సన్న బియ్యం, మహిళలా సంఘాలకు ఇస్తన్న తోడ్పాటు.. తదితర పథకాలను అమలు చేస్తున్నది ప్రభుత్వం అని తెలియజెప్పాలని సూచించారు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులు చేస్తున్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్పాలని ఆయన సూచించారు..
తుక్కుగూడ పార్టీ మఖ్యనాయకుల ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమములో.. మున్సిపాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ భవాని వెంకట్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జానకిరాం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శివగల్ల యాదయ్య, బోద పాండురంగా రెడ్డి, కోటగళ్ళ రాజ్ కుమార్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సమంతా, బాస్కర్ రెడ్డి, ఎలగొండి పద్మ, మాజీ కౌన్సిలర్ కొండల్ యాదవ్, నాగిల్ల శేఖర్, శేకర్ రెడ్డి, శ్రీదర్ గౌడ్, మజర్ బాయి, అబ్దుల్ రహూప్, రవి కుమార్, పైజల్ ఖాద్రీ, కప్పల రాజ్, అస్మా, అనీస్, నసీమ్,షెహానాజ్, సారా, బాదర్ ఉన్నీస, షకీర, హసీయ, ఫరీదా, కతీజ, అమ్జద్, నవీన్ గౌడ్, నియాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు.