ఎల్బీనగర్:
కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సరూర్ నగర్ డివిజన్ హుడా కాంప్లెక్స్ నుండి నెక్సా కార్ షో రూం వరకు వాటర్ వర్క్స్ నిధులు రూ. 55 లక్షలతో ఏర్పాటు చేయనున్న డ్రైనేజి నిర్మాణం పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. హుడా కాంప్లెక్స్ కాలనీ ప్రజలు సుదీర్ఘకాలంగా డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్నారని ఇకనుండి ఆ సమస్య ఉండదన్నారు. ప్రజల సంక్షేమం కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం చంద్రు నాయక్,మేనేజర్ మమత, కాలనీవాసులు అనూప్ రాజ్, మల్లారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు లోకసాని కొండల్ రెడ్డి, ధర్పల్లి అశోక్, శ్రీనివాస్ గౌడ్, రాజ్ కుమార్ గుప్తా, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రోటోకాల్ పాటించని జలమండలి అధికారులు
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి కాలనీ వాసులు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కానీ జలమండలి అధికారులు డీజీఎం, మేనేజర్ ప్రోటోకాల్ పాటించకుండా కార్యక్రమం అయిన తరువాత నింపాదిగా రావడం కనిపించింది.


