హామీ ఇచ్చిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్..
పలు కాలనీల్లో పర్యటించిన ఎంపీ..
శనివారం రోజు ఉదయం రాక్ టౌన్ కాలనీ, అలాగే నాగోల్ డివిజన్ లో ఉన్న కాలనీల సమస్యలు అడిగి తెలుసుకొని, వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తానని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్టానిక కార్పొరేటర్ అరుణ సురేందర్ యాదవ్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, గడ్డిన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్, పరిసర కాలనీ ల అసోసియేషన్ సభ్యులు, రాక్ టౌన్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని వారి వారి కాలనీల సమస్యలు, అభివృద్ధికి కావలసిన కార్యక్రమాలు ఈటల రాజేందర్ కి వ్రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించి.. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తా అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కాలనీ ల అసోసియేషన్ సభ్యులకు, కాలనీ సభ్యులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ కాలనీలకు వచ్చి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తా అని చెప్పిన ఈటెల రాజేందర్ కి రాక్ టౌన్ కాలనీ అసోసియేషన్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని రాక్ టౌన్ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి తెలియజేశారు..