శుభోదయం కాలనీలో పర్యటించిన కార్పొరేటర్..
సమస్యల పరిష్కారానికి హామీ..
హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి బుధవారం రోజు కాలనీవాసుల విజ్ఞప్తి మెరకు డివిజన్లోని శుభోదయ కాలనీలో పర్యటించి కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కాలనీవాసులు కాలనీలో భూగర్భ డ్రైనేజ్ సదుపాయం ఏర్పాటు చేసి చాలా కాలం గడవడంతో పలు చోట్ల డ్రైనేజ్ మాన్ హోల్స్ ధ్వంసమై దూర్వసనతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారని తెలపడంతో కార్పొరేటర్ వెంటనే సంబంధిత జలమండలి సిబ్బందితో శుభోదయ కాలనీ భూగర్భ డ్రైనేజ్ మాన్ హోల్స్ మరమ్మతులు జరిపించాలని ఆదేశించారు.. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు గఫార్, సత్యనారాయణ తోబాటు కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు..