Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణకీ.శే. మల్ రెడ్డి బాల్ రెడ్డికి ఘన నివాళి..

కీ.శే. మల్ రెడ్డి బాల్ రెడ్డికి ఘన నివాళి..

  • వర్ధంతి సందర్భంగా కార్యక్రమం..
  • పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ..
  • అన్నదాన వితరణ కార్యక్రమం..
  • కార్మికులకు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చేలా కృషిచేస్తానని హామీ ఇచ్చిన మల్ రెడ్డి..

ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి తండ్రి గారైన కీ.శే మల్ రెడ్డి బాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, తన స్వగ్రామం తొర్రురులో వారి తండ్రి సమాధి వద్దకు కుటుంబ సమేతంగా వెళ్లి నివాళుర్పించారు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి.. వీరితోపాటు రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, తుర్కయాంజల్ మున్సిపల్ చైర్మన్ మల్ రెడ్డి అనురాధ రాం రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్ రెడ్డి యాదిరెడ్డి, యువ నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులర్పించారు.. అనంతరం తొర్రుర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ లో తన తండ్రి జ్ఞపకార్ధం గా మున్సిపల్ సిబ్బంది (పరిశుద్ధ కార్మికులకు) దుస్తులు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు తన తండ్రి గారైన మల్ రెడ్డి బాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులందరికి నూతన దుస్తులను అందజేశామని, పారిశుద్ధ్య కార్మికులు కూడా బాధ్యతతో పనిచేస్తే మన గ్రామాలు, మన వార్డులు, పరిశుభ్రంగా ఉంటాయని, మన నియోజకవర్గంలోని ప్రజలు వ్యాధులకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారని, మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని వారికి సూచించారు. నిరుపేద పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం నుండి వచ్చే ఇందిరమ్మ ఇళ్లను అందేలా చూస్తామని వారికి హామీ ఆయన ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments