Monday, June 23, 2025
Google search engine
Homeఇంటర్నేషనల్క్షమాపణ చెప్పిన రష్యా అధ్యక్షుడు..

క్షమాపణ చెప్పిన రష్యా అధ్యక్షుడు..

17 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు ఇప్పుడు స్పందన..
ఓ మీటింగ్ కు పెంపుడు కుక్కతో వచ్చిన పుతిన్..
ఆ సంఘటన తనను చాలా బాధించింది అన్న అధ్యక్షుడు..

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్.. జ‌ర్మ‌నీ మాజీ ఛాన్స‌ల‌ర్ ఏంజిలా మెర్క‌ల్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. 17 ఏళ్ల క్రితం జ‌రిగిన ఆ ఘ‌ట‌న‌పై ఆయ‌న‌ ప‌శ్చాతాపం వ్య‌క్తం చేశారు. 2007లో సోచి న‌గ‌రంలో జ‌రిగిన ఓ మీటింగ్‌కు మెర్క‌ల్ హాజ‌ర‌య్యారు. అయితే ఆ మీటింగ్‌కు పుతిన్ పెంపుడు శున‌కం లాబ్ర‌డార్ కోని కూడా వ‌చ్చింది. మెర్క‌ల్ కూర్చున్న కుర్చీ చుట్టూ ఆ శున‌కం ప‌హారా కాసింది. ఆ స‌మ‌యంలో మెర్క‌ల్ కాస్త ఆందోళ‌న‌కు గుర‌య్యారు. కుక్క‌ల‌కు భ‌య‌ప‌డే మెర్క‌ల్ ఆ ఘ‌ట‌న ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు. ఇటీవ‌ల ఫ్రీడ‌మ్ అనే టైటిల్‌తో మెర్క‌ల్ ఓ పుస్త‌కాన్ని రాశారు. దాంట్లో ఆ ఘ‌ట‌న గురించి ఆమె ప్ర‌స్తావించారు. పుతిన్ పెంపుడు కుక్క వ‌ల్ల తాను చాలా ఇబ్బందిప‌డిన‌ట్లు పేర్కొన్నారు. త‌న‌ను బెదిరించేందుకు పుతిన్ ఆ ప‌ని చేశార‌ని మెర్క‌ల్ త‌న బుక్‌లో తెలిపారు. ఆ ఘ‌ట‌న ప‌ట్ల గురువారం పుతిన్ మ‌రోసారి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments