వెల్లడించిన కప్పాటి పాండురంగా రెడ్డి
పల్లె జాతర రెండవ విడత కార్యక్రమం..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె జాతర రెండవ విడత కార్యక్రమలో భాగంగా కందుకూరు మండలం, బాచుపల్లిలో ప్రత్యేక అధికారి ఖజా హబీబులద్దీన్, కార్యదర్శి శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలసి పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి.. పనుల జాతరలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 80,000 తో నిర్మాణం చేసిన పశువుల సెడ్ ను, రూ. 25 వేలతో నిర్మించనున్న కంపోస్టు పిట్ నిర్మాణం కొరకు ముగ్గును పోసి ప్రారంభించారు.. అనంతరం పాండురంగా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా రూ. 2,199 కోట్లతో పనుల జాతర కార్యక్రమం ద్వారా తెంలగాణ పల్లెల్లో లక్షకు పైగా పనులు లక్యంగా. మార్చి 2026 నాటికి అన్ని పనులను పూర్తి చేసేలా.. ప్రజా ప్రభుత్వం కార్యచరణ రూపొందించిందన్నారు. ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు, గ్రామీణాభివృద్ధికి ఈ పనుల జాతర కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఇది రాజకీయాలకు అతీతమైన పండుగ అన్నారు..
ఈ జాతరలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాల మరుగుదొడ్లు, పశువులు, మేకలు, కోళ్ల షెడ్‌లు, వ్యవసాయ చెరువులు, ఓపెన్ బావులు, నర్సరీలు, తోటలు, నీటి సేకరణ చెరువులు, సిసి రోడ్లు, చేపల చెరువులు, చెక్ డ్యామ్‌ల నిర్మాణంతో సహా విస్తృత శ్రేణి గ్రామీణ పనులను గ్రామీణాభివృద్ధి కోసం ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తున్న పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది అని అన్నారు. ఈ కార్యక్రమము అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందిని సన్మానించారు.
ఈ కార్యక్రమములో జాతీయ ఉపాది హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మద్దెల రాములు, మాజీ సర్పంచ్ యలాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవులపల్లి క్రిష్ణ, మండల ఎస్సి సెల్ అధ్యక్షుడు వెంకటేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొంతం యుగెందర్ రెడ్డి, అనెగోని నవీన్ గౌడ్, మలగల విజయ్ కుమార్, కాటం దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


