Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేష్‌ నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా జరగాలి..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేష్‌ నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా జరగాలి..

ఎకో ఫ్రెండ్లీ విధానంలో సాఫీగా జరిగేలా చూడాలి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్
నగరంలో నిమజ్జన ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్..
నిమజ్జన పాయింట్ లలో భద్రతా, శుభ్రత, స్మూత్ నిమజ్జన విధానాలపై అధికారులతో కమిషనర్ క్షేత్ర సమీక్ష..
గ్రేటర్ లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేష్‌ నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా,ఎకో ఫ్రెండ్లీ విధానంలో సాఫీగా జరిగేలా చూడాలనీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులకు సూచించారు. శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ , అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, సంబంధిత ప్రభుత్వ శాఖలు, విభాగాల అధికారులతో కలిసి సనత్‌నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద తవ్విన కుంట, నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా బేబీ పాండ్, అమీర్‌పేట్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన పోర్టబుల్ పాండ్లను వాటి నాణ్యత ను ప్రత్యక్షంగా పరిశీలించారు. భద్రతా, శుభ్రత, స్మూత్ నిమజ్జన విధానాలను సమీక్షించారు. నిర్వహకులు, కమ్యూనిటీ నాయకులు, భద్రతా ఏజెన్సీ ల మధ్య సమన్వయం ను కమిషనర్ సమీక్షించారు.

బారికేడింగ్, లైటింగ్, క్యూ లైన్ లు, కంట్రోల్ రూం ఏర్పాట్లను పరిశీలించి నిమజ్జనం సజావుగా జరిగేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గత లోటుపాట్లను సమీక్షించుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనం జరగాలనే లక్ష్యంతో మౌలిక సదుపాయాలు, శుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, భద్రత, ట్రాఫిక్ నిర్వహణ అంశాలపై బహుముఖ వ్యూహంతో ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. ప్రధాన నీటి వనరుల పై ఒత్తిడి తగ్గేలా చూడడం, ట్రాఫిక్ ఇబ్బందులు దూరం చేసే ఉద్దేశ్యంతో భక్తులకు అందుబాటులో ఉండేలా నగరవ్యాప్తంగా 72 కృత్రిమ నిమజ్జన పాయింట్లు సిద్ధం చేశామన్నారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన పాయింట్ లలో 56,187 తాత్కాలిక లైట్లు, 309 మొబైల్ టాయిలెట్లు, బారికేడింగ్, త్రాగునీటి సదుపాయం, మైక్ సిస్టం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతిమల నిమజ్జనం వేగంగా, స్మూత్ గా జరిగేలా చూసేందుకు 134 స్టాటిక్ క్రేన్లు, అదనంగా 269 మొబైల్ క్రేన్లు వినియోగిస్తున్నామని చెప్పారు. 160 గణేష్ అసిస్టెన్స్ టీంలు పనిచేస్తున్నాయి.

స్వచ్ఛత కు ప్రాధాన్యం :

14,486 శానిటేషన్ సిబ్బంది, 160 గణేశ్ యాక్షన్ టీమ్‌లు మూడు షిఫ్ట్ లలో నిరంతరాయంగా విధులు నిర్వర్తిస్తున్నారనీ కమిషనర్ చెప్పారు. గణేష్ మండపాల వద్ద వ్యర్థాల సేకరణకు 5 లక్షల ట్రాష్ బ్యాగులు పంపిణీ చేశారు. అదనంగా 2,000 స్వీపర్లు, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు, 30 స్వీపింగ్ మెషిన్లు నిమజ్జన దినాన చెత్త తొలగింపులో పాల్గొంటాయన్నారు.. ప్రత్యేక శుభ్రతా డ్రైవ్‌లో 1,400 మెట్రిక్ టన్నుల చెత్త, శిథిలాలు తొలగింపు చేశామని తెలిపారు. 839 కి.మీ. మేర రహదారులు, అంతర్గత రోడ్ల కు అర వైపుల చెట్ల కొమ్మల కత్తిరింపు చేశామన్నారు.

ఎకో ఫ్రెండ్లీ విధానంలో వేడుకలు జీహెచ్ఎంసీ ప్రోత్సాహం :
వేడుకలను పర్యావరణహితంగా జరుపుకునేలా జీహెచ్ఎంసీ ప్రోత్సాహం అందిస్తుందనీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. ఈ వేడుకల్లో 2 లక్షల వినాయక మట్టి ప్రతిమలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తో కలిసి జీహెచ్ఎంసీ భక్తులకు పంపిణీ చేసిందన్నారు. నీటి వనరులు కలుషితం కాకుండా నగర వ్యాప్తంగా మొత్తం 74 కృత్రిమ నిమజ్జన కొలనులను ఏర్పాటు చేసిందన్నారు. వీటిలో 28 పోర్టబుల్ పాండ్స్, 21 ఎక్స్కావేషన్ పాండ్ లు, 28 బేబీ పాండ్ లు ఉన్నాయన్నారు.

ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం :
56 వేల ఇళ్లలో యాంటీ లార్వల్ ఆపరేషన్లు పూర్తి చేశామని, వైద్యారోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వ్యర్థాలు పేరుకునే ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరిచినట్లు కమిషనర్ చెప్పారు.

వేడుకలు సాఫీగా,సజావుగా జరిగేలా రోజువారీ సమీక్షలు :
గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో భక్తి భావం పెంపొందించేలా జరిగేందుకు ప్రతి రోజు క్షేత్రస్థాయి పరిశీలనలు, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామనీ తెలిపారు . రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయని కమిషనర్ వివరించారు. పోలీసులతో కలిసి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, నిమజ్జనం సజావుగా సాగేందుకు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.

10,300 కు పైగా గుంతల పూడ్చివేత :
రోడ్డు సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా ఊరేగింపు జరిగే మార్గాల తో పాటు నగరంలో 10,300 కు పైగా గుంతలను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం పూడ్చివేసిందన్నారు. రోడ్డు మరమ్మతులు కూడా పూర్తి చేసిందనీ చెప్పారు. గత సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా గణేశ్ నిమజ్జనం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ స్పష్టం చేశారు.

ప్రజలు, భక్తులు సహకరించాలి :
గణేష్ నిమజ్జనం ఆధ్యాత్మిక వాతావరణంలో సజావుగా, సురక్షితంగా జరిగేలా చూసేందుకు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది.
పర్యావరణ హిత సదుపాయాలను వినియోగించుకోవాలని, అధికారులు చేస్తున్న కృషికి సహకరించాలని నగర ప్రజలు, భక్తులకు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments