Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు..

ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు..

గడ్డి అన్నారం డివిజన్ లో కార్యక్రమం..
అతిధిగా హాజరైన మల్ రెడ్డి రాంరెడ్డి..

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం డివిజన్, దిల్ సుఖ్ నగర్ లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు రోడ్ డెవలప్‌‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి..

భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లలితా నగర్ కాలనీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మల్‌రెడ్డి రాంరెడ్డి చొరవతో మెట్రో కింద ఇనుప రేలింగ్ తొలగించడంతో లలితా నగర్ కి మార్గం సులభమైందని, తద్వారా గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్ కి వ్యాపార కష్టాలు తీరాయన్నారు స్థానికులు.. ఇలాంటి నాయకులు అధికారంలో ఉంటేనే మాలాంటి సామాన్య ప్రజల కష్టాలు తీరుతాయన్నారు.

ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇది పూర్తిగా ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు వారి సమస్యలు పరిష్కరించడమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అన్నారు. రహదారుల అభివృద్ధిని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుందని తెలిపారు. ఆర్ అండ్ బి శాఖ రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రచించి, అమలు చేస్తున్నది అని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments