Monday, June 23, 2025
Google search engine
Homeహెల్త్చ‌లికాలంలో బోన్ సూప్ తాగితే ఏమవుతుందో తెలుసా..?

చ‌లికాలంలో బోన్ సూప్ తాగితే ఏమవుతుందో తెలుసా..?

చ‌లికాలంలో స‌హ‌జంగానే మ‌నం మ‌న శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాం. అందుకు గాను అనేక మార్గాల‌ను అనుస‌రిస్తుంటాం. అలాగే డైట్‌లోనూ అనేక మార్పులు చేసుకుంటాం. మ‌నం తీసుకునే కొన్ని ర‌కాల ఆహారాలు మ‌న శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచేందుకు ఎంత‌గానో దోహద‌ప‌డ‌తాయి. ఇక చ‌లికాలంలో చాలా మంది వేడిగా ఉండే ఆహారాల‌ను తింటుంటారు. ముఖ్యంగా కారం, మసాలాలు, ఘాటుగా ఉండే ప‌దార్థాల‌ను తింటారు. దీంతో క‌ఫం క‌రిగిపోతుంది. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి సైతం పెరుగుతుంది. శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌మ‌నం ల‌భిస్తుంది. అయితే చ‌లికాలంలో క‌చ్చితంగా బోన్ సూప్‌ను తాగాల్సి ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చ‌లికాలంలో బోన్ సూప్ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి.

పోష‌కాల‌తో నిండిన ఆరోగ్య‌వంత‌మైన ఆహారంగా బోన్ సూప్‌ను చెప్ప‌వ‌చ్చు. ఈ సూప్‌తో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌ట‌న్ బోన్స్‌ను బాగా ఉడికించి ఆ సూప్‌ను తాగుతంటే ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఎముక‌లు, మ‌జ్జ‌, టెండాన్లు, చ‌ర్మం, లిగ‌మెంట్లను ఎక్కువ స‌మ‌యం పాటు ఉడికించ‌డం వ‌ల్ల వాటిలోని పోష‌కాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. అలాంటి సూప్‌ను తాగితే మ‌న‌కు పోష‌కాలు ల‌భిస్తాయి. ముఖ్యంగా బోన్ సూప్‌లో గ్లైసీన్‌, ఆర్జినీన్‌, ప్రోలీన్ త‌దిత‌ర అమైనో యాసిడ్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, గ్లూకోజ‌మైన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరంలో ఆరోగ్య‌క‌ర‌మైన క‌ణ‌జాల నిర్మాణానికి స‌హాయ ప‌డ‌తాయి. బోన్ సూప్‌లో కొల్లాజెన్ అనే ప్రోటీన్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా చ‌లికాలంలో చ‌ర్మం ప‌గ‌ల‌కుండా చూస్తుంది.

అజీర్తి, విరేచ‌నాలు, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బోన్‌సూప్‌ను తాగితే మంచిది. దీంతో జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శ‌రీరానికి అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే బోన్‌సూప్‌లో ఉండే కొల్లాజెన్ చ‌ర్మ క‌ణ‌జాలం త‌యారీకి ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతో చ‌ర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. అలాగే సాగే గుణం పెరిగి య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. బోన్‌సూప్‌ను తాగడం వ‌ల్ల ఎముక‌ల ఆరోగ్యానికి అవ‌స‌రం అయిన పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతో ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

కండ‌ర ప‌టుత్వంలో కీల‌క‌పాత్ర‌ను పోషించే అమైనో యాసిడ్ గ్లైసీన్‌. క‌ణాల్లోకి శ‌క్తిని ప్ర‌వ‌హింప‌చేసి కండ‌రాల‌కు శ‌క్తిని ఇచ్చే ఈ పోష‌కం త‌గ్గితే కండ‌రాలు క్షీణించి, కండ‌ర న‌ష్టం కూడా జ‌రుగుతుంది. కాబ‌ట్టి ఈ అమైనో యాసిడ్ పుష్క‌లంగా ల‌భించే బోన్ సూప్ తీసుకోవ‌డం వ‌ల్ల కండ‌రాల‌ను బ‌ల‌ప‌రుచుకోవ‌చ్చు. యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథియోన్ శ‌రీరంలోని విషాల‌ను స‌మ‌ర్థంగా హరించే డిటాక్సిఫ‌యింగ్ ఏజెంట్‌. ఈ యాంటీ ఆక్సిడెంట్ బోన్ సూప్‌లో ల‌భిస్తుంది. ఈ సూప్‌తో పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫ‌లితంగా ఇమ్యూనిటీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంది.

బోన్ సూప్‌లోని అమైనో యాసిడ్లు ఇన్హిబిట‌రీ న్యూరోట్రాన్స్‌మిట‌ర్ల‌లా ప‌నిచేస్తాయి. ఇవి నిద్ర‌కు, స్ప‌ష్ట‌మైన ఆలోచించ‌గ‌లిగే, నిర్ణ‌యాలు తీసుకోగ‌లిగే సామ‌ర్థ్యానికి, జ్ఞాప‌క‌శ‌క్తికి తోడ్ప‌డే హార్మోన్ల ఉత్ప‌త్తిని పెంచుతాయి. ఇలా ఎముక‌ల సూప్ మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. క‌నుక దీన్ని ఈ సీజ‌న్‌లో తీసుకోవ‌డం మ‌రిచిపోకండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments