నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4కి అల్లు అర్జున్ హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ ఎపిసోడ్ విడుదలైంది. ఏ ఎపిసోడ్ ఎంతగా వైరల్ అయిందో తెల్సిందే. తాజాగా మరో ఎపిసోడ్ ప్రోమోను ఆహా ఓటీటీ విడుదల చేసింది. అందులో బన్ని పిల్లలు అయాన్, అర్హ సందడి చేశారు. అర్హా తెలుగులో పద్యం పాడగా.. బాలకృష్ణ ప్రశంసించారు. నవంబర్ 22న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.